గతేడాది ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఈ దివంగత నటుడికి తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అయితే, ఆయన పేరు మీదే ఓ ఓ జాతీయ అవార్డు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. సుశాంత్ అవార్డు త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో అవార్డుని నెలకొల్పి ఇతర నేషనల్ అవార్డ్స్ తో పాటు అందిస్తారట. అదే జరిగితే సుశాంత్ పేరు ఎప్పటికీ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?
భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది, కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. 29 మంది ప్రయాణికులతో.. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు …
Read More »రీల్ పాత్రలో రీయల్ లాయర్..?
తమిళ స్టార్ హీరో మోహన్ లాల్,అలనాటి అందాల భామ మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం-2’ సినిమాలో రేణుక అనే లాయర్ పాత్ర పోషించారు నటి శాంతి ప్రియ. ఈమె మూవీలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అడ్వకేట్ కావడం విశేషం. కేరళలోని ఎర్నాకులంలోనే లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన శాంతి.. గతంలో సుప్రీంకోర్టులోని శబరిమల కేసు విచారణలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. కేరళ హైకోర్టులో ఇప్పటికీ కేసులు వాదించే ఈమె.. …
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,712కు చేరింది. ఇందులో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,94,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో ఒకరు చనిపోగా… మొత్తం 1,625 కరోనా మరణాలు సంభవించాయి
Read More »దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.
Read More »కృతిశెట్టికి ‘ఉప్పెన’లో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా..?
‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్‌కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.
Read More »అనసూయ సంచలన నిర్ణయం
ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.
Read More »మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.
Read More »