ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 15,968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది. మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవల క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …
Read More »పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మలు పెడుతుంటరు. రకరకాల బొమ్మలు తయారుచేసి చేన్లలో పెడితే మనుషుల దృష్టి వాటిమీద పడి పంట దిగుబడి పెరుగుతుందని నమ్ముతరు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంటకు దిష్టి తగులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read More »కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక నిర్ణయం
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్ సింగ్ మాన్(బీకేయూ), ప్రమోద్ కుమార్ జోషి(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), …
Read More »హైదరాబాద్‌కు చేరుకున్న కరోనా టీకా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. 6.5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. మరికాసేపట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించనున్నారు. కోఠి ఆరోగ్య కార్యాలయంలో …
Read More »‘భోగి’ పండుగ అంటే ఏంటీ ?
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం …
Read More »సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. …
Read More »మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ ప్రశంసలు
పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను …
Read More »అద్భుతంగా పల్లె ప్రగతి : సీఎం కేసిఆర్
‘పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడిన నాడు …
Read More »