Home / SLIDER / సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌

సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు.

మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

అయితే కరోనాతో ఆమె ఆటకు దూరం అయ్యారు. పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం నాటి కరోనా టెస్టులకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మంగళవారం టోర్నీ ప్రారంభం అవుతున్న విషయాన్ని చాలా ఉత్సాహంగా తెలిపారు సైనా.  ఆమెతో పాటు మరో క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్‌ కూడా కరోనాకు గురైనట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు.