ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్‌లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్ …
Read More »రూ.7.30 లక్షలతో నూతన కమ్యునిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో రూ.7.30 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శుభకార్యాలకు, పండగలకు కమ్యూనిటీ హాల్ …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు
ప్రస్తుతందేశంలో కరోనా కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోమారు పెరిగాయి. ఈరోజు 74 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 66 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 74,442 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య …
Read More »కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు
పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ..?
త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికారికంగా ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నర్సారెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.గతంలో నాలుగు సార్లు గెలుపొందిన అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి రఘునందన్ రావు …
Read More »సెక్స్ రాకెట్లో సంజనా ఉందా..? నిజమా..?
ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మధ్యలో కోలీవుడ్ ను ఒక ఊపు ఊపుతున్న హాట్ టాపిక్ డ్రగ్స్ కేసు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వరకు అందరూ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు రాగిణీ ద్వివేది,సంజనా గల్ర్తానీలను అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా …
Read More »చిరు పక్కన రమ్యకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా లూసిఫర్ మూవీలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని దర్శకుడు వినాయక్ ఆలోచిస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఇందుకు దర్శకుడు …
Read More »తెలంగాణలో 2లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. అయితే ఇప్పటి వరకూ మొత్తంగా 2,00,611కి కరోనా కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 1,171కి చేరుకుంది.తాజాగా తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా 1,72,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు …
Read More »తమన్నాకు కరోనా
టాలీవుడ్ హాట్ బ్యూటీ మిల్క్ భామ తమన్నాకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నగరంలోని వారం రోజులుగా హైటెక్ సిటీ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. గత రెండు రోజులుగా తీవ్రమైన తలనొప్పి,జ్వరంతో బాధపడుతున్న ఈ మిల్క్ …
Read More »ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రముఖ వైద్యులు మార్కండేయులు తన 46వ పుట్టిన రోజు సందర్భంగా చిలుకూరులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 46 మొక్కలు నాటారు. అలాగే.. …
Read More »