Home / NATIONAL / దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు

ప్రస్తుతందేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న్పించ‌డంలేదు. గ‌త ప‌దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు మ‌రోమారు పెరిగాయి.

ఈరోజు 74 వేల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 66 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 74,442 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 66,23,816కు చేరింది. ఇందులో 9,34,427 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మ‌రో 55,86,704 మంది క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు.

కాగా, క‌రోనాతో కొత్త‌గా మ‌రో 903 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 1,02,685 మంది చ‌నిపోయార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.