అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా వైరస్ పరీక్షలు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భద్రత కల్పించే 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
Read More »తెలంగాణలో కొత్తగా కొత్తగా 1811 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదవగా, 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది. అదేవిధంగా మృతులు 505కకు పెరిగారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన పాజిటివ్ …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్‌లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్‌లో 151, వరంగల్ అర్బన్‌లో 102 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 97, నల్లగొండలో 61, నిజామాబాద్‌లో 44, మహబూబ్‌నగర్‌లో 41, మహబూబాబాద్‌లో 39, సూర్యాపేటలో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్లలో 30, గద్వాలలో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 27గా నమోదయ్యాయి. ఖమ్మంలో 26, సిద్దిపేటలో 24, వనపర్తిలో 23, జనగామలో 22, …
Read More »కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నదని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా …
Read More »ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే
‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనియ్యను’ అని ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని చంపడం లేక యాసిడ్ పోయడం వంటి చర్యలను సినిమాల్లో, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి దుర్మార్గ ఆలోచనే ఇప్పుడు ఆంధ్రా ఆధిపత్యవాదంతో ఉండే నాయకగణం, వారి అనుంగు మీడియా చేస్తున్నది. తెలంగాణపై, ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఐదవది అయిన హైదరాబాద్‌పై అక్కసునంతా వెళ్లగక్కుతూ విషప్రచారానికి ఒడిగడుతున్నది. తెలంగాణ సాధన కోసం పోరాటం …
Read More »అబద్ధాలకు ప్రతీక ఆర్కే
వాస్తవం ఇదీ కాంగ్రెస్ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు. 2014, ఆగస్టు 3 – కొత్త …
Read More »అబద్ధాలకోరు..ఆర్కే..!
తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం రాష్ట్రం రాదంటూ.. అసలు సాధ్యమే కాదంటూ లాజిక్‌కు కూడా అందని పిచ్చిరాతలు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వదు.. ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నదన్నాడు.. కేంద్రం తీర్మానాన్ని అసెంబ్లీ తిరస్కరించాక ఇచ్చే ప్రశ్నేలేదనీ రాశాడు.. 371 అధికరణానికి రాజ్యాంగ సవరణచేయకుండా రాష్ట్ర విభజన దుస్సాధ్యమన్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అబద్ధాల, దగాకోరు రాతలకు తెలంగాణ బిడ్డలు ధైర్యం కోల్పోయి బలయ్యారు.. కానీ రాష్ట్ర విభజన ఆగలేదు. మురికిగుంట నుంచి ముత్యమైనా …
Read More »మంత్రి కేటీఆర్ పిలుపుకు స్పందించిన జోగు రామన్న
పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ శ్రీ జోగు ప్రేమేందర్. ఈ సందర్భంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని శాసన సభ్యులు జోగురామన్న గారు కలిసి పట్టణ అభివృద్ధిపై చేపడుతున్న కార్యక్రమాల సరళిపై చర్చించడం జరిగింది. ఇటివల మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందించిన …
Read More »3రోజుల పాటు బక్రీద్
ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సంబంధిత ఏర్పాట్లను సమీక్షించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి .ఎస్. లోకేష్ కుమార్ తో పాటు జోనల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల …
Read More »తెలంగాణకు వర్ష సూచన
రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, అలాగే నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతున్నాయని వీటితో ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. …
Read More »