Home / SLIDER / ప్రధాని మోదీపై మంత్రి తలసాని ఫైర్

ప్రధాని మోదీపై మంత్రి తలసాని ఫైర్

 దేశం నుంచి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ఆయన చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని  పాల్గోని అనంతరం మీడియాతో మాట్లాడారు.

నిన్న ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన  బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం చప్పగా సాగిందన్నారు. ఆయన హైదరాబాద్‌ అందాలు చూసి వెళ్లారని చెప్పారు.సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారని మంత్రి తలసాని విమర్శించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని చెప్పారు. బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.ఆదివారం నాటి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నీళ్లు, నిధుల గురించి మాట్లాడారని, రెండ్రోజులపాటు జరిగిన కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా అని ప్రశ్నించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar