టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 51,000 మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరపున వీరూ ఈ సాయం చేస్తున్నాడు.
Read More »చాహల్ కుటుంబంలో కరోనా కలవరం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
Read More »టీమిండియా ఆటగాడు ఆశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం
టీమిండియా ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య పృథ్వీ నారాయణన్ తెలిపింది. శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ట్వీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు …
Read More »విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 …
Read More »2013 తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్ బౌండరీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ధోనీ చివరిసారిగా 2013లో సరైన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు. అప్పటి నుంచి 64 బంతులు ఎదుర్కొన్నప్పటికీ బౌండరీ బాదలేకపోయాడు. నిన్న 65వ బంతికి ఫోర్ కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్లో, ముందరికి కొడితే బాల్ వెనకవైపు వెళ్లి, బౌండరీ లైన్ దాటింది. ఇప్పటి వరకు ఒక్క …
Read More »ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం
బుధవారం కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …
Read More »ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …
Read More »దేశ ప్రజలకు కోహ్లీ పిలుపు
దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …
Read More »కోహ్లికి అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.
Read More »ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రకటన
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్ ఇక వన్డేల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వన్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. షమి, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి కోలుకుంటుండటంతో వాళ్ల పేర్లను పరిశీలించలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో …
Read More »