Home / SLIDER / టీమిండియా ఆటగాడు ఆశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం

టీమిండియా ఆటగాడు ఆశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య పృథ్వీ నారాయణన్‌ తెలిపింది. శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ట్వీట్‌ చేసింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు పిల్లలకు పాజిటివ్‌గా తేలింది. పిల్లల కారణంగా అందరికీ వైరస్‌ వ్యాపించింది.

కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం ఓ పీడకలలా గడిచింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి’ అని ప్రీతి ట్వీట్లలో సూచించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఐపీఎల్‌ సీజన్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.