ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని …
Read More »కరోనా ఎఫెక్ట్ -రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం.. మీరు …
Read More »లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?. అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలను సీఎం …
Read More »కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు
కరోనా వైరస్ కట్టడికి పల్లెలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల గ్రామాలు సరిహద్దులను మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా, స్థానికులెవరూ బయటికి వెళ్లకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, రాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి కట్టడి చర్యలు చేపట్టాయి. మూసివేసిన చోట్ల ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా కరోనాపై ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొన్ని వందల గ్రామాల్లో నిత్యావసర వాహనాలు మినహా మిగిలిన …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేస్తున్నారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.దీనిపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లు ఎవరు భయపడాల్సినవసరంలేదు.హాస్టల్స్ …
Read More »లాక్ డౌన్ నుండి వీటికి మినహయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ నుండి కొన్నిటిని మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మినహయిస్తున్నట్లు తెలిపారు. అయితే వ్యవసాయ పనులు చేసేవాళ్లు గుంపుగుంపులుగా కాకుండా ఇరిగేషన్ పనులు చేస్కోవచ్చు. రైతులను,కూలీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా …
Read More »కరోనా ఎఫెక్ట్ – ప్రజాప్రతినిధులపై సీఎం కేసీఆర్ అగ్రహాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య,మున్సిపల్,పోలీసు శాఖలకు చెందిన అధికారులతో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మీడియాతో మాట్లాడుతూ ” లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ అధికారులు ,సిబ్బంది,కలెక్టర్లు మాత్రమే కన్పిస్తున్నారు.ప్రజాప్రతినిధులు ఎక్కడని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .మనల్ని …
Read More »కరోనా ఎఫెక్ట్ – సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ బాధ్యతను మరిచి రోడ్లపై కి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు …
Read More »ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్
విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. లండన్ నుంచి వచ్చిన ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు (24), హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన యువకుడు (23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు (23), స్వీడన్ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలుకు చెందిన యువకుడు (26), …
Read More »సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్‌షా ప్రశంసించారు.
Read More »