Home / SLIDER / కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు

కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు

కరోనా వైరస్‌ కట్టడికి పల్లెలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల గ్రామాలు సరిహద్దులను మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా, స్థానికులెవరూ బయటికి వెళ్లకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, రాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి కట్టడి చర్యలు చేపట్టాయి.

మూసివేసిన చోట్ల ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా కరోనాపై ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొన్ని వందల గ్రామాల్లో నిత్యావసర వాహనాలు మినహా మిగిలిన వారినెవరినీ లోపలికి అనుమతించలేదు.

* మెదక్‌ జిల్లాలో 129, సిద్దిపేటలో 101, సంగారెడ్డిలో 53 గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా కట్టెలు వేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

* అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో సుమారు 950 గ్రామాల్లో రోడ్లపై కంచెలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఆదిలాబాద్‌ జిల్లాలోనే 900 పంచాయతీలు ఇతరులెవరినీ ఊళ్లలోకి రానివ్వమని తీర్మానం చేశారు. మొక్రా(కె) గ్రామం నుంచి బయటకు వెళ్తే రూ. 1000 జరిమానా వసూలు చేయనున్నట్లు గ్రామస్థులు తీర్మానించారు.