Home / Tag Archives: TELANGANA STATE (page 10)

Tag Archives: TELANGANA STATE

నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Read More »

నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్లో నిర్వహించిన #askktrలో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారుల సలహాను బట్టి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా.. తెలంగాణలో 18,339 యాక్టివ్(నిన్నటి వరకూ) కేసులున్నాయి. రోజుకు దాదాపు 2000కేసులు వెలుగు …

Read More »

బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడటం బంద్ చేయాలని అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పై చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లివచ్చిన వాళ్లూ కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని తెలిపారు.

Read More »

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర సీఎం,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల వరుసగా జాతీయ పార్టీలకు చెందిన నేతలను,ఇతర రాష్ట్రాలకి చెందిన తాజా మాజీ సీఎంలతో భేటీ అవుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ మరోసారి స్పందించారు. తెలంగాణలో ఉండి రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విటర్లో ఆయన #AskKTR సెషన్ నిర్వహించారు. ఈ …

Read More »

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో.. ‘పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని కోట్ల మంది రైతుల తరఫున కోరుతున్నా. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. ధాన్యం కొనుగోళ్లు ఆపారు. వ్యవసాయ ఖర్చును విపరీతంగా పెంచారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Read More »

మోదీకి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత, విద్యార్థుల తరపున మీరు త్వరగా సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. గత 7 సంవత్సరాలలో రాష్ట్రం నుంచి అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ, NDA ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయలేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో మంజూరైన విద్యాసంస్థల వివరాలను కేటీఆర్ పంచుకున్నారు.

Read More »

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సర్జరీలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Read More »

సీఎం కేసీఆర్ తో తేజస్వీ యాదవ్ భేటీ అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ పాలసీ, విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ …

Read More »

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని కేసీఆర్.. లాలూతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని లాలూ కోరినట్లు సమాచారం. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరముందని లాలూ అన్నట్లు తెలిసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat