Home / SLIDER / జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై మంత్రి కేటీఆర్ క్లారిటీ

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర సీఎం,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల వరుసగా జాతీయ పార్టీలకు చెందిన నేతలను,ఇతర రాష్ట్రాలకి చెందిన తాజా మాజీ సీఎంలతో భేటీ అవుతున్న సంగతి విదితమే.

ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్
మరోసారి స్పందించారు. తెలంగాణలో ఉండి రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విటర్లో ఆయన #AskKTR సెషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘మేం మిమ్మల్ని భారతదేశానికి ఐటీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం. జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి..?’ అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి మంత్రి కేటీఆర్ పై విధంగా బదులిచ్చారు.