దుబ్బాక ఉపఎన్నికలో 82.61% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 86.24% ఓట్లు పోలవగా.. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక బీహార్ లో 94 స్థానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో 53.51% ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ తుదివిడత ఎన్నికలు ఈనెల 7న జరగనుండగా.. ఈ ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 10న లెక్కించనున్నారు..
Read More »ఏక్షణంలోనైన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ఈ నెల 13న రానుంది నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ లో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని.. ప్రతీ సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. 150 డివిజన్లకు 150 మంది ROలను …
Read More »తెలంగాణలో కొత్తగా 1536 కరోనా కేసులు
తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరుకుంది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,351 మంది మృతి చెందారు. తెలంగాణలో …
Read More »రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి
దుబ్బాకలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. భాజపా అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని …
Read More »బీజేపీపై మంత్రి హారీష్ ఫైర్
బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో దుబ్బాక ప్రజలు ఆలోచించాలని, తప్పుడు ప్రచారాలని నమ్మి మోసపోతే గోస పడతామని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు, మేధావులకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల అబద్ధాలపై …
Read More »ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లోరోసిస్ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.
Read More »తెలంగాణరాష్ట్రంలో 1,531 కరోనా కేసులు.. ఆరుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. మూడు రోజులుగా 1481, 1504, 1531 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగితే పండుగ సందర్భంగా వైరస్ వ్యాప్తి మొదలైనట్లు భావించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గురువారం 43,790మందికి పరీక్షలు చేయగా మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు పెరిగింది. మరో ఆరుగురు మృతితో మొత్తం మరణాల సంఖ్య 1,330కు చేరింది.
Read More »ఏపీ ,తెలంగాణకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ షాక్
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీఆర్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందించాయి. …
Read More »నేటి నుండి రాత్రి 9.30వరకు మెట్రో రైళ్లు
ప‌్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకల సమయాన్ని అధికారులు పొడిగించారు. దీంతో నేటి నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటివరకు విరామాలతో రాత్రి తొమ్మిది గంటల వరకు రైళ్లను నడిపారు. అయితే రద్దీ పెరగడంతో రైళ్ల సమయాలను మరో అరగంట పాటు పొడిగించారు. ప్రతి మూడు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్చి …
Read More »ఆకులు కాదు పూవ్వులే
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దూరం నుంచి చూస్తే పూల మాదిరిగా, దగ్గరికి వెళ్లి చూస్తే ఆకులని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Read More »