తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. 1933 తర్వాత ఇప్పుడు వెంకన్న ఆస్తులు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది టీటీడీ దేవస్థానం. బంగారం డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, నగదు, భూములు రూపంలో శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయంటే.. దేశంలోనే ముఖ్యమైన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, డబ్బు …
Read More »తిరుమలలో మార్చి 5 నుంచి శ్రీవారి విశేష ఉత్సవాలు..!
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవారికి నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకలు, శ్రీవారి విశేష ఉత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు..ఇలా ఏడాదిపొడవునా వివిధ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 25 న ఉగాది …
Read More »మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటీ …!
టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు…వైవి సుబ్బారెడ్డి. ఇప్పటికే కొండపై వీఐపీ ఎల్ 1,ఎల్2 విఐపీ పాసుల విషయంలో కాని, లడ్డూల విషయంలో కాని, వృద్ధులకు, బాలింతలకు త్వరతిగతిన దర్శనాల విషయంలో కాని, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విషయంలో కాని వైవి సుబ్బారెడ్డి తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ మరో ముందడుగు …
Read More »వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు..!
రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని…భక్తుల విశ్వాసం..వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో …
Read More »తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం.. కేసు నమోదు చేసిన టీటీడీ అధికారులు..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …
Read More »టీటీడీ మరో బంపర్ ఆఫర్..వారికి ప్రతి రోజూ 4 వేల టోకెన్లు..!
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వృద్ధులకు అరగంటలోనే శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తాజాగా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4వేల టోకెన్లను కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు …
Read More »గరుడవారధిపై టీటీడీ బోర్టుమరో కీలక నిర్ణయం..!
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతినగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి గతంలో చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ …
Read More »టీటీడీ పాలకమండలి మరో సంచలన నిర్ణయం..సర్వత్రా హర్షం…!
వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని టీటీడీ కొత్త పాలకమండలి రోజుకో సంచలన నిర్ణయంతో తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా అక్టోబర్ 23 న బుధవారం నాడు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతిలో సంపూర్ణమద్య నిషేధానికి సిఫార్స్ చేసింది. కాగా ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో ఇప్పటికే మద్యనిషేధం అమలులో ఉంది. సిగరెట్లు, గుట్కాలు వంటివి పూర్తిగా నిషేధించారు. కాగా కొండ కింద తిరుపతి నగరంలో సంపూర్ణ …
Read More »నేటి నుంచి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం..!
వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తాజాగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించి, రూ. 10 వేలు విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడికి …
Read More »తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ…!
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 న అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. పత్రి ఏటా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు ఆంధ‌్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తదితరులు సీఎంకు …
Read More »