Home / ANDHRAPRADESH / మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటీ …!

మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటీ …!

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు…వైవి సుబ్బారెడ్డి. ఇప్పటికే కొండపై వీఐపీ ఎల్‌ 1,ఎల్‌2 విఐపీ పాసుల విషయంలో కాని, లడ్డూల విషయంలో కాని, వృద్ధులకు, బాలింతలకు త్వరతిగతిన దర్శనాల విషయంలో కాని, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విషయంలో కాని వైవి సుబ్బారెడ్డి తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ మరో ముందడుగు వేయనుంది. ఛైర్మన్ గా చేపట్టిన తక్కువ సమయంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వైవి ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకు లైట్ మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా పద్మావతీ అతిథి గృహంలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వి‌ఎస్ రెడ్డితో భేటీ అయిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి లైట్ మెట్రో రైలు గురించి చర్చించారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించడం జరిగినది. భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చి దిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక కోరడం జరిగింది.

 

కాగా కోనేటి రాయుడి కొండల్లో రైలు కూతకు రంగం సిద్ధమవుతుంది. తిరుపతి నుంచి తిరుమల లైట్ మెట్రో రైలు ఏర్పాటుకు ఓ ప్రైవేట్ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే తిరుమల కొండల్లో మోనో రైలు ప్రాజెక్టు కోసం ఓ సర్వే కూడా చేయించింది. తిరుపతిని కేంద్రం స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో తిరుపతి తిరుమల మధ్య మోనో రైలు ప్రాజెక్టు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతికి రోజు లక్ష మంది భక్తులు వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకుంటారు..తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ రెట్టింపు అవుతుంది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కి.మీ. ల దూరం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డుకు సమాంతరంగా మోనో రైలు మార్గాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు యూఎంటీసీ తేల్చింది. తిరుపతి బస్ స్టేషన్ నుంచి కపిలతీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకు 27 కి.మీ. మేర మోనో రైలు మార్గాన్ని నిర్మించవచ్చని..సర్వే చేసిన సంస్థ తన నివేదికలో తెలిపింది. మోనో రైలుమార్గం నిర్మాణంతోపాటు, ఆరు మోనో రైలు ఇంజన్లు, వంద బోగీల కొనుగోలుకు రూ. 3510 కోట్లు నిధులు అవసరమవుతాయని ఆ సంస్థ గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

 

తిరుపతి ఆర్టీసీ బస్‌ స్టేషన్ పక్కనే, ఓ రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వద్ద, రైల్వే స్టేషన్ నిర్మించాలని సదరు సంస్థ ప్రతిపాదించింది కూడా. ప్రతి రోజు సగటున 65 వేల మంది భక్తులు..తిరుమలకు వస్తున్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఒక్కోసారి గరిష్టంగా 500 మంది భక్తులను తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ద్వారా చేర్చవచ్చు. చిన్నపాటి వర్షం వచ్చినా కొండచరియలు విరిగిపడి..ఘాటు రోడ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నందున.. మోనో రైలు ఏర్పాటుపై అప్పటి తిరుపతి ఎంపీగా ఉన్న వరప్రసాద్ తుడా అధికారులతో సమీక్షించారు. మోనో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను తుడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు పంపారు. వాస్తవంగా తిరుమల కొండల్లో రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. అయితే రోజు రోజుకీ లక్షకు పైగా భక్తులు వస్తున్నందున తిరుమలకు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే  మొత్తంగా సీఎం జగన్ మార్గదర్శకత్వంలో, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ‌్యంలో తిరుమల కొండల్లో రైలు కూతపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat