కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవారికి నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకలు, శ్రీవారి విశేష ఉత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు..ఇలా ఏడాదిపొడవునా వివిధ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 25 న ఉగాది పండుగతో ముగుస్తాయి. ఈ మేరకు శ్రీవారి విశేష ఉత్సవాలను కన్నులపండుగ నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విశేష ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, కుమారధార తీర్థ ముక్కోటి, లక్ష్మీ జయంతి, శ్రీ అన్నమాచార్య వర్ధంతి, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మార్చి నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి…!
మార్చి 5 నుంచి 9వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
మార్చి 5న శ్రీ కులశేఖర ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం
మార్చి 9న కుమారధార తీర్థ ముక్కోటి
మార్చి 10న లక్ష్మీ జయంతి
మార్చి 21న శ్రీ అన్నమాచార్య వర్ధంతి
మార్చి 25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం