తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం …
Read More »దరువు కార్టూనిస్ట్ ను పరామర్శించిన హరీష్ రావు..
సీనియర్ జర్నలిస్ట్ , ప్రముఖ దరువు కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు కు ఇటీవల గుండె చికిత్స ( స్టంట్స్ ) జరిగింది.. ఈరోజు సిద్దిపేట లో రమణారావు నివాసంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని తెల్సుకున్నారు…రమణ బాయ్.. !! అధైర్య పడకు నేను అండగా ఉంటా… ని ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు.. నీకు నేను ఉన్నానని ఆత్మీయంగా చెప్పారు.ఆరోగ్యం …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన వరంగల్ నూతన మేయర్ గుండా ప్రకాష్
నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ ని కేటీఆర్ అభినందించారు. నూతన మేయర్ తో పాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్గన్పూర్ …
Read More »మోదీకి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ సమాజం…అందుకే ఈ కుట్ర
తెలంగాణ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ ఆకాంక్ష యొక్క సత్తా చాటులున్నారు. అయితే, వారిపై మోదీ సారథ్యంలోని అధికారులు, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వారణాసిలో పోటీచేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను సమాజం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ నుంచి పసుపు రైతులు, ఫ్లోరోసిస్ బాధితులు సిద్ధమయ్యారు. అయితే దేశం మొత్తానికి ఒకే రకం ఎన్నికల నిబంధనలు ఉండగా.. వారణాసిలో ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తున్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనల …
Read More »ఢిల్లీలో ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేలా టీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్‌ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్క్ కేటీఆర్ హ్యాష్‌ట్యాగ్‌తో …
Read More »ఇంటర్ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం….
తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్ చేసి వెట్ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి …
Read More »తెలంగాణ ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు..!
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్,ఇరవై మూడు మంది ఐపీఎస్ లకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల కమీషన్ అనుమతితో జీవో నెంబర్ 15 తో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్ల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఇంకో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా …
Read More »తెలంగాణలో కంటి వైద్యశిబిరాలతో సత్ఫలితాలు
తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. గత ఏడాది అంటే 2018 ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన కంటి వైద్య శిబిరాల నిర్వహణను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, వైద్యులు, …
Read More »ఇది ఉద్యోగులు,ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన.
ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ ఒక లే అవు ట్ ఆమోదిస్తుంది. లే అవుట్ చేసిన వ్యక్తి అందులోని ప్లాట్లను కొందరికి అమ్ముతారు. రిజిస్ట్రేషన్ల్ల శాఖ దస్తావేజులు రిజిస్టరు చేస్తుంది. కొన్న వారికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేతికి వస్తాయి. కానీ భూమి హక్కు పత్రం మాత్రం రాదు. లే అవు ట్ చేసిన భూమి …
Read More »