తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్
2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు
Read More »దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ-ఏపీ
కరోనా లాక్ డౌన్, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 2020 జూన్ నాటికి దేశంలో 55.41% ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లుండగా.. సెప్టెంబర్ కు అది 57.29%గా ఉంది. ఇక వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా చూస్తే మహారాష్ట్ర తొలి స్థానంలో, ఏపీ-తెలంగాణ సర్కిల్ 2వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద మందిలో 67.69% మందికి …
Read More »కరీంనగర్ జిల్లాలో ఒకే ఊరిలో 33మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా రావడం కలకలం రేపుతోంది, రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు… ఆయన అంత్యక్రియలు, కర్మకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్గుంపూర్ వాసులు వచ్చారు. వీరిలో కొందరికి లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా… 33నుందికి కరోనా వచ్చింది. దీంతో ఇవాళ కూడా గ్రామంలో కరోనా టెస్టులు చేయనున్నారు.
Read More »ఎంపీ రేవంత్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ,ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్ల పాటు తాను రైతుల కోసం ఉద్యమిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేస్తున్న సొమ్ము వారి అప్పుల వడ్డీకే సరిపోతుంది తప్ప పెట్టుబడికి సాయపడటం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ …
Read More »గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …
Read More »స్త్రీ నిధి పథకం ద్వారా మహిళలకు అండ
తెలంగాణ రాష్ట్రంలో పాలకొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున బర్రెలు, ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి పథకం ద్వారా సుమారు రూ.800 కోట్ల రుణాలతో రెండేండ్లలో పాడిరైతులకు లక్ష బర్రెలు, ఆవులు అందించనున్నది. ఇప్పటికే 14 వేల బర్రెలు, ఆవుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. రుణాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50వేల యూనిట్లను పాడిరైతులకు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. కరోనా ప్రభావంతో ఆటంకాలు …
Read More »YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »రైతుబంధు కోసం రూ.14,500కోట్ల నిధులు
తెలంగాణ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ధీమా పెంచామని, ఇప్పటికే రైతుబంధు కోసం రూ.14,500 కోట్ల నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,500 రైతు వేదికలకు రూ.600 కోట్లు ఖర్చు …
Read More »నేడే మేయర్ ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వేళయింది. గురువారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ విప్ జారీచేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి తలసాని …
Read More »