Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు ముగిసింది. ఆయన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పలు సమస్యలపై మోడీ అమిత్ షా తో చర్చించినట్టు తెలుస్తుంది.
ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాల కావస్తున్న రాష్ట్రానికి ఇప్పటికీ చాలా సమస్యలు వేధిస్తున్నాయని.. వాటి పరిష్కారం ఇంకా దొరకలేదని.. అందువల్ల తమకు వినతిపత్రం అందజేయడానికి వచ్చానని ప్రధానమంత్రి మోడీ గారికి తెలియజేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనకు సంబంధించి చాలా అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వాటికి ఇంకా పరిష్కారం దొరకలేదని కావున తమరు త్వరగా వాటిని పరిష్కరించమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీ కోరినట్టు తెలుస్తోంది.
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రుణాలు పరిమితి దాటి తీసుకుందని అందువల్ల ప్రస్తుతం ఏపీకి రుణ పరిమితిని విధించారని అందువలన రాష్ట్రం ఇబ్బంది పడుతుందని కావున తమరు ఈ ఈ సమస్యపై రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఆయువుపట్టైనటువంటి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయమని చాలామంది దానిపై ఆధారపడి ఉన్నారని మోడీ కి తెలియజేశారు. ఈ విధంగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి సమస్యలపై చర్చించడంతో వాటి పరిష్కారం దొరుకుతుందని ప్రజలంతా భావిస్తున్నారు.