కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.
Read More »పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు- సీఎం కేసీఆర్
కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు. ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.
Read More »వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా కలర్ తెలుసా..?
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ..నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా షర్మిల ఈ నెల 8న ప్రారంభించనున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో …
Read More »యాత్ర సీక్వెల్ లో జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘యాత్ర’ సినిమాతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘యాత్ర 2’ ని కూడా రూపొందించబోతున్నట్టు మహి వి.రాఘవ్. అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను …
Read More »ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక మహిళా పోలీసు..
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »పోతిరెడ్డిపాడు నుండి నీటి దోపిడీ ఆగాల్సిందే..
తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. వీటివల్ల కృష్ణా నదీజలాల్లో తెలంగాణ న్యాయబద్ధంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, …
Read More »పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని …
Read More »Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »AP 2021-22 వార్షిక బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, …
Read More »