Home / ANDHRAPRADESH / ఏపీ సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుందా..?..2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనా..?

ఏపీ సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుందా..?..2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనా..?

ఇది చదవడానికి కాస్త విడ్డూరంగా ఉన్న కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను.. ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అవుననే చెప్పాలి. ఇటీవల ఒక ప్రముఖ జాతీయ మీడియా చెపట్టిన సర్వేలో టాప్ టెన్ లో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్థానం లభించకపోవడం కూడా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇమేజ్ మసకబారుతుందని చెప్పొచ్చు..

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్ర చెపట్టి ప్రజలకు దగ్గరై ..ప్రజల సమస్యలను వింటూ “నేను విన్నాను. నేను ఉన్నాను” అనే నినాదంతో ఏపీ ప్రజల మదిని గెలుపొంది .. ఒక్క అవకాశమివ్వండి అని ప్రజలను నమ్మబల్కి అధికారంలోకి వచ్చాడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అధికారంలో రాగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అనే రీతిలో ముందుగా ఏపీకి మూడు రాజధానులు అంటూ సంచలనాత్మక ప్రకటన చేసి తన పతనానికి తానే నాంది పలికినట్లు అన్పించుకున్నారు సీఎం జగన్. ఏ రాష్ట్రానికైన దేశానికైన ఒక రాజధాని ప్రాంతముంటేనే ఆ రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

అయితే ఏపీకి మూడు రాజధానుల ప్రకటనతో జగన్ ప్రజల్లోనే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లైంది.

ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన ఇప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుంది. అని రాజధాని ప్రాంతంలో అనేక నిర్మాణాలను చెపట్టింది. ఆ తర్వాత టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు లేదా పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలతో కావచ్చు ఏపీ ప్రజలు టీడీపీని కాదని వైసీపీకి ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి భారీ పరాజయం మూటకట్టి వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముద్రను చెరిపేయాలనే క్రమంలో కరకట్టపై ఉన్న ప్రజావేదిక దగ్గర నుండి రాజధాని మార్పు వరకు.. టీడీపీ నేతలపై కేసుల దగ్గర నుండి సంగెం డైరీని మూసేయాలనే వరకు వీటన్నింటిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పొకడతో ఇటు రాజకీయ పార్టీలోనే కాకుండా ప్రజల్లోకూడా చులకనయ్యారు.

సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై దేశ ద్రోహాం కేసులను బనాయించి ఒక ఎంపీ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సదరు ఎంపీ RRR చేప్పడం లాంటి సంఘటనలు కూడా జగన్ ఇమేజ్ ను దెబ్బతీశాయనే చెప్పాలి.

ఒకవేళ ఆర్ఆర్ఆర్ తప్పు చేసి ఉంటే ముందుగాల ఆ పార్టీని సస్పెండ్ చేసి ఆ పార్టీ తరపున గెలుపొందాడు కాబట్టి అతనిపై అనర్హత వేయాలని జగన్ ఒక పార్టీ చీఫ్ గా లోక్ సభ స్పీకర్ కు సూచించాల్సిందని ఇటు విశ్లేషకులతో పాటు ప్రజలు గుసగుసలాడుకోవడం కూడా జగన్ పై ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంలో ఒక భాగమైంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిలను అవసరానికి వాడుకోని జగన్ వదిలేశాడని… వైఎస్ షర్మిల తనకు జరిగిన అవమానంతో ఏపీని వదిలేసి తెలంగాణలోకి అడుగు పెట్టి పార్టీ పెట్టారు అనే ప్రచారం జగన్ కు పెద్దదెబ్బ,. స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసిన కానీ ఎన్నికలు నిర్వహించడంలో ఈసీతో గొడవలు. గతంలో తనపై నమోదైన సీబీఐ కేసులన్నింటిలోనూ కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడం. అధికారంలోకి రాకముందు కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక వాళ్లను గాలికొదిలేయడం.. ఒక్క బహిరంగ సభను నిర్వహించకపోవడం.. ప్రజల్లో తిరగకపోవడం ఇలా అన్ని స్వయంకృతాపరదాలతో జగన్ తన ఇమేజ్ ను తానే దెబ్బతీసుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రిహోదాలో.. బాధ్యతయుతమైన స్థానంలో ఉండి కోడాలి నాని లాంటి వాళ్లు.. ఎమ్మెల్యేలుగా ఉన్నవాల్లు టీడీపీపై ,టీడీపీ నేతలు,చంద్రబాబుపై నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం లాంటివి కూడా జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయనడంలో ఎలాంటి అశ్చర్యం లేదు. గత రెండేండ్లుగా మూడో నాలుగో పథకాలు తప్పా ఏపీ ప్రజలకు చేసిందేమి లేదని అక్కడక్కడ గుసగుసలు విన్పిస్తున్నాయి. వైసీపీ ఎంపీలను గెలిపించండి. అధికారం ఇవ్వండి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకోస్తా అని తీరా ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించినాక జగన్ చేతులెత్తేయడం కూడా జగన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పొగొట్టిందని ఆర్ధమవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగ వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాలు.. అక్రమాలు. జగన్ స్వయకృతాపరదంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar