ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే …
Read More »మంత్రి జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలి-టీడీపీ నేత డిమాండ్
ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం …
Read More »ఏపీలో ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని, 11,243 మందికి ఉపాధి లభించిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ హయాంలో 264, వైసీపీ హయాంలో 869 ఏర్పాటయ్యాయి. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. Al, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్ …
Read More »చేయలేకపోతే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశమిస్తా: జగన్
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు. అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి …
Read More »స్కూళ్లలో బోధనకు స్మార్ట్ టీవీలు.. ప్రొజెక్టర్లు: సీఎం జగన్ ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ బోధన చేపట్టాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 3వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ ప్రొజెక్టర్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు కింద పూర్తిచేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ …
Read More »పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్
పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …
Read More »ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధులు: సీఎం జగన్
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం …
Read More »ఏపీలో అర్హులైన 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.
Read More »త్వరలో సీఎం జగన్ ‘ప్రజాదర్బార్’
త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వనున్నారు. శని, …
Read More »టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్‌నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More »