Home / ANDHRAPRADESH / ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బుర్ర లేదు..!!.. క‌త్తి మ‌హేష్ షాకింగ్ రివ్యూ

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బుర్ర లేదు..!!.. క‌త్తి మ‌హేష్ షాకింగ్ రివ్యూ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీ అధినేతకు బుర్ర లేదంట‌. ఈ మాట‌లు స్వ‌యాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. కాగా, గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ టార్గెట్‌గా ప‌లు ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు క‌త్తి మ‌హేష్‌.

ఈ క్ర‌మంలోనే ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన క‌త్తి మహేష్ పై విధంగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అస‌లు బుర్రే లేదంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అలా అన‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా వివ‌రించాడు క‌త్తి మ‌హేష్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త వారంలో ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టన‌లో భాగంగా మాట్లాడుతూ.. కులాలపై త‌న స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని చెప్ప‌లేద‌ని, క‌మ్మ‌కు ద‌గ్గ‌ర కాదు.. కాపుకు దూరం కాదు అంటూ ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. అస‌లు జ‌న‌సేన పుట్టిందే కాపుల కోస‌మ‌ని చెప్పుకొచ్చాడు క‌త్తి మ‌హేష్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కులాల గురించి మాట్లాడ‌టం వెనుక ఏదో ఒక మ‌త‌ల‌బే ఉంటుంద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడాల‌నుకుంటే ఏపీలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాట‌న్నింటిని వ‌దిలేసి కేవ‌లం కాపుల గురించి మాట్లాడ‌టం వెనుక ఉన్న మ‌త‌ల‌బేంట‌ని ప్ర‌శ్నించారు.