ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన వైఎస్సార్ కడప జిల్లాలో వర్గపోరు మరింత ఉద్రిక్తంగా మారింది.ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ కార్యాలయంపై తెలుగు తమ్ముళ్ళు దాడులు చేశారు.
See Also:మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
అసలు విషయానికి వస్తే జిల్లాలో గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపూర్ లోని పునరావాస కాలనీ పనులకు సర్కారు టెండర్లు పిలిచింది.ఈ విషయంలో స్థానిక మంత్రి ఆదినారాయణ రెడ్డి ,రామసుబ్బారెడ్డి వర్గీయులు సిండికేట్ అయ్యారనే విషయం తెలుసుకున్న రమేష్ పిలిచిన టెండర్లను రద్దు చేశారు.అంతే రెచ్చిపోయిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ,రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్కడితో ఆగకుండా రమేష్ కార్యాలయం మీద దాడులు చేసి ఏకంగా నిప్పు పెట్టి తగులబెట్టారు.
See Also:చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరు -AP మంత్రి సంచలన వ్యాఖ్యలు …