ప్రముఖ దర్శకుడు తిరుమల కిశోర్ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఓ చిత్రం రాబోతుందని, నేను.. శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు వరుస హిట్స్ ఇచ్చిన తిరుమల కిశోర్ ఖాతాలో మరో హిట్ పడబోతుందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తిరుమల కిశోర్ చెప్పిన లవ్ స్టోరీ బాగున్నప్పటికీ.. ఆ కథలో రెండు మూడు మార్పులు చేయాలని నాని కోరాడట.
మామా – అల్లుడు సినిమాకు టైటిల్ ఫిక్స్..!
స్టోరీ లైన్ మార్చేందుకు ఇష్టపడని తిరుమల కిశోర్.. ఆ స్టోరీనే మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌కు వినిపిస్తే వెంటనే ఓకే చెప్పాడని, అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఏదేమైనా టాలీవుడ్‌కు రెండు హిట్స్ ఇచ్చిన తిరుమల కిశోర్ చెప్పిన కథలో మార్పులు చేర్పులు చేయమనడం నానికి తగదని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.