తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగార్థుల మనోభావాలకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది అభ్యర్థులకు మేలు చేసేలా పరీక్ష తేదీలో మార్పులు చేసింది. తెలంగాణ గిరిజన, బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. వచ్చే జూలై నెల 29వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
see also:ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్..ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం
ఈనెల 15వ తేదీన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉన్నందున ఈ తేదీని మార్చాలని పెద్ద ఎత్తున అభ్యర్థులు కోరిన నేపథయలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో తమకు మరింత సమయం కలిసి వచ్చిందని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
see also: ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!
Post Views: 240