ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడకు చుట్టుకుంటోందని చర్చ జరుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది లీడర్లు తాను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలో ఉండడాన్ని పదేపదే ఎత్తిచూపడంతోనే.. రాజీనామా చేసినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
see also:పరకాల రాజీనామా వెనక సంచలనాత్మక ట్విస్ట్ ..!
ఈ పరిణామంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ టార్గెట్‌గా టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నప్పటికీ…అది తెలుగుదేశానికే బూరాంగ్ అయ్యేలా మారిందని అంటున్నారు. తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఇంకా సాగుతుందని అంటున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి సతీమణిని టీటీడీలో సభ్యురాలిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆరోపణలు వస్తే..ఆయన ఇది తన నిర్ణయమని పేర్కొంటూ తప్పించుకున్నారు. మరోవైపు ఇంకో రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు. వినుకొండలో మున్సిపల్ ఛైర్మన్ తెలుగుదేశం ఉండగా… వైస్ ఛైర్మన్ బీజేపీ నేతల ఉన్నారు. NUDA డైరెక్టర్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి సైతం ఇదే కోవలోకి చెందుతుందని చెప్తున్నారు. ఇలా ఎన్నో వాస్తవాలు ఉండగా..వాటిని పక్కనపెట్టి టీడీపీ గగ్గోలు పెట్టడాన్ని, వైసీపీపై విమర్శలు చేయడాన్ని ఎవరూ అంగీకరించరని పలువురు పేర్కొంటున్నారు.