టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో అరవింద సమేత ఒకటి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అజ్ఞాతవాసితో త్రివిక్రమ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినప్పటికీ అదేమీ కూడా అరవింద సమేతపై ప్రభావం చూపలేదు. పైగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. అందుకే ఈ చిత్రం అద్దిరిపోయే బిజినెస్ చేస్తోంది.
see also:పవన్‌తో పరిచయం కొనసాగుతుంది..!
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం వైజాగ్ ఏరియా మినహాయించి మొత్తం ఆంధ్రాలో రూ.40 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. అందులో సీడెడ్ ఏరియా హక్కులు రూ.11 కోట్లు పలికినట్టు తెలిసింది. మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 7 నుంచి 10 కోట్ల బిజినెస్ చేసే అవకాశం లేకపోలేదు. అంటే మొత్తంగా లెక్కేస్తే ఒక్క ఆంధ్రా రీజియన్‌లోనే 50 కోట్ల మార్క్‌ను దాటినట్టు లెక్క. ఇక ఓవర్సీస్‌లో ఆల్రెడీ రూ.12 కోట్ల డీల్ కుదిరిన విషయం తెలిసిందే. నైజాంలోనూ తారక్‌కు, త్రివిక్రమ్‌కు మంచి మార్కెట్ ఉంది కాబట్టి కనీసం 18 నుంచి 20 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్రలో కనిపించున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.