సుప్రీం హీరో సాయి ధరమ తేజ అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్థకత్వంలో తెరకెక్కిన చిత్రం తేజ్ ఐ లవ్యూ. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా పరాజయాల్లో ఉన్న తేజ్ ఈ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగుండటంతో ఈ సారి తేజు ఎలాగైనా హిట్ కొడతాడని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంపై పాజిటివ్ కామెంట్స్ చేసి సినిమాపై మరింత క్రేజ్ తెచ్చాడు. సినిమా విజువల్స్, సంగీతం బాగుందని, కరుణాకరణ్ నుంచి వస్తున్న నమ్మకమైన సినిమాగా ఉందంటూ.. నిర్మాతలకు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశాడు.