టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొరపాటు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవచ్చు. ప్రతీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేటర్ లేదని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పరిస్థితి అలానే ఉంది. ఇటీవల కాలంలో పదే.. పదే నోరు జారుతున్న ఆయనకు విషయ పరిజ్ఞానం లేదనుకోక తప్పదు. వర్ధంతిని.. జన్మదినంగా.. జన్మదినాన్ని వర్ధంతిగా మార్చి చెప్పడం మంత్రి లోకేష్‌కే చెల్లిందని టీడీపీ నేతలే అంటున్నారు.
see also:జగన్ జస్ట్ మిస్ – సెల్ఫీ కోసమని వచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా..??
అయితే, మంత్రి నారా లోకేష్ తాజాగా మరో సారి నవ్వులపాలయ్యారు. కాగా, శుక్రవారం కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మంత్రి నారా లోకేష్ ప్రసంగాన్ని వింటే ఈ విషయం స్పష్టమవుతుంది. ఆ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ప్రమాదపుశాత్తు ఎవరైనా చనిపోతే.. అనబోయి ప్రమాదపు శాతం అని, సహజ మరణమైతే .. అనబోయి సహజ మరణవ్ తే అంటూ చెప్పడం లోకేష్‌కే చెందిందని ప్రజలు అంటున్నారు.
see also:
ఇంకా తెలుగుదేశం పార్టీ జోడెద్దుల బండి అనబోయి.. తెలుగుదేశం పార్టీ జోదెద్దుల బండి అంటూ ధర్మపోరాట దీక్షలో నారా లోకేష్ ప్రసంగించారు. ఇలా నారా లోకేష్ ప్రసంగాన్ని పూర్తిగా విన్న వారిలో నవ్వుకున్న వారు కొందరైతే.. కామెంట్ల వర్షం కురిపించిన వారు మరికొందరు. ఇలా టీడీపీ నిర్వహించిన ప్రతీ సభలోనూ చినబాబు తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ నెటిజన్లకు అడ్డంగా బుక్కవుతున్నారు. నారా లోకేష్ తీరుపై చేసేదేమీ లేక.. సానుభూతి చూపించడం టీడీపీ శ్రేణులవంతైంది.