Home / education / నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.

రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఆయన తెలిపారు. అయితే విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ కు లాగినై తెలుసుకోవచ్చు.