Home / 18+ / ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?

ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?

నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.
దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ ఆయన చెప్పుకొచ్చారు.కాని ఇందులో ఒక్క పేరు మాత్రం మహేష్ చెప్పలేదు.అయితే కావాలని చెప్పలేదా,మర్చిపోయారా అనేది ప్రస్తుతం అందరికి అనుమానంగా మారింది.ఇంతకు ఆ వ్యక్తి ఎవరూ అనుకుంటున్నారు.తెలుగు ఇండస్ట్రీ లో మహేష్ కు స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా “పోకిరి” ఈ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోరు. ఎందుకంటే పూరీ ఈ చిత్రంతో మహేష్ ని మాస్ గా మార్చారు.ఆ తరువాత ‘బిజినెస్ మ్యాన్’ కూడా మంచి విజయం సాధించింది.అలాంటి డైరెక్టర్ పేరు చెప్పలేదు అంటే ఏమనుకోవాలి?

అసలు విషయానికి వస్తే వీరిద్దరి కలిసి మూడో చిత్రంగా ‘జనగణమన’ చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఆ చిత్రం అక్కడే ఆగిపోయింది.అంతేకాకుండా దీనికి ముందు పూరీకి వరుసగా ఫ్లోప్ లే ఉన్నాయి.మహేష్ కు స్టొరీ చెప్పడంలో పూరీ విఫలమవడంతో చిత్రం అక్కడితో ఆగిపోయింది.అందుకనే వీరిమధ్య విభేదాలు అని సమాచారం.అయితే మహేష్ వీటన్నిటినీ కొట్టిపడేసారు.తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పూరీ కి సారీ కూడా చెప్పారు మహేష్.అంతేకాకుండా నా కెరీర్ లో మంచి హిట్ అందించినందుకు థాంక్స్ అని చెప్పారు.