టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుందనే వార్త అప్పట్లో దావానంలా పాకింది. తాజా సమాచారం ప్రకారం సైరాలో అనుష్క స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో స్టాలిన్ చిత్రంలో చిరుతో కలిసి స్టెప్పులేసిన ఈ అమ్మడు మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత చిరుతో కాలు కదపనుందట.
టాకీ పార్ట్ తర్వాత `సైరానరసింహారెడ్డి`లో అనుష్క సాంగ్‌ను చిత్రీకరిస్తారని టాక్. సైరా చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.