Home / 18+ / సినిమాలో చిరంజీవికి ఏ సీన్ బాగా నచ్చిందో తెలుసా.?

సినిమాలో చిరంజీవికి ఏ సీన్ బాగా నచ్చిందో తెలుసా.?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ మహర్షి సత్తా చాటుతున్నాడు. ఈ సందర్భంగా మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్యూ చెప్పారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా నచ్చిందని, ముఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్‌ ఆయనను బాగా మెప్పించిందన్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు రైతుగా నటించడాన్ని చిరంజీవి అభినందించారని డీఎస్పీ తెలిపారు. దీంతో చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మెగాస్టార్‌కి థ్యాంక్స్ చెప్పారు. సినిమాను మెగాస్టార్ మెచ్చుకోవడంతో మహర్షి టీం ఎంతో హర్షం వ్యక్తం చేసింది.