ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది.
అంతేకాకుండా సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోంతంగా నిర్వహించిన పలు సర్వేలలో కూడా వైసీపీ గెలుస్తుందని కూడా తేలింది. ఈ క్రమంలో ఈ నెల ఇరవై మూడున విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికలం ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం ఖాయం కావడంతో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం షరా మాములే. అయితే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.అదే ప్రస్తుత ముఖ్యమంత్రి తీసుకుంటున్న జీతం తీసుకోకుండా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారట.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ అధికారులు ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా చక్కగా పని చేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని అయిన సరే రూపాయి లంచం కూడా తీసుకోకుండా చేయాలని అధికారులకు మంచి సందేశం ఆ రోజే ఇవ్వడానికి జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారు అట. దీంతో నాడు వైద్య విద్య పూర్తిచేసిన జగన్ తండ్రి,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం రూపాయి మాత్రమే తీసుకుని వైద్యం చేసి కడప జిల్లాలో రూపాయి వైద్యుడుగా పేరు గావించారు. నాడు తన తండ్రి చేసిన పనిని జగన్ నేడు ముఖ్యమంత్రిగా రూపాయి మాత్రమే జీతం తీసుకుని చరిత్రలో నిలిచిపోవాలని ఆలోచిస్తున్నారని వైసీపీ ముఖ్య శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆది నుండి సరికొత్త ఒరవడికి తెరలేపె జగన్ ముఖ్యమంత్రిగా ఇంకా ఎన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టిస్తారో కాలమే సమాధానం చెబుతుంది.