Home / ANDHRAPRADESH / నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్

నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్

సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల వలన నన్ను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.

అయితే తను చేసిన తప్పు గురించి ప్రస్తావించకుండా ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించడం నేను దొంగతనం చేశాను కానీ నన్ను ఏమి అనొద్దని అన్నట్లు ఉంది. అయితే ఇలా ఒక వెబ్ మీడియాకు రవిప్రకాష్ ఇంటర్వూ ఇచ్చారని బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ లో రావడం గమనార్హం.