Home / 18+ / ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం ఒక్కసారి చూడండి..!

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం ఒక్కసారి చూడండి..!

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ పచ్చ మీడియాపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్‌ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోంది.చంద్రబాబు హయంలో ఒక పెద్ద మాఫియా నడుస్తుందని,అందులో టీవీ9 సీఈఓ రవిప్రకాష్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారని ఆయన అన్నారు.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ బాబుగారు ప్రజల ధనాన్ని దోచుకోవడం తప్ప జనాలకు చేసింది ఏమీ లేదని అన్నారు.ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశమంతట ఈ మాఫియా విస్తరిస్తోంది అని చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.