Home / ENVINORNMENT / హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఈ రోజు సోమవారం సాయంత్రం వర్షపు జల్లులతో పులకరించిపోయింది. ఈ రోజు ఉదయం నుండి చల్లగా ఉన్న వాతావరణం వర్షంతో మొత్తంగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్ ,జూబ్లిహీల్స్,బంజారాహీల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్ ,ఎస్ఆర్ నగర్ ,కూకట్ పల్లి,మియాపూర్,మల్కాజ్ గిరి,కుషాయిగూడ తదితర ప్ర్తాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే గత రెండు నెలలుగా ఎండలతో తీవ్రంగా ఇబ్బందిగా ఫీలైన నగరవాసులు వర్షంతో పులకరించిపోయారు.