Home / ANDHRAPRADESH / వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?

వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ స‌మావేశంలో త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై ప్ర‌ధాని మోదీని ఒప్పించే ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ అంశాన్ని రేపు జ‌రిగే నీతి ఆయోగ్ స‌మావేశంలో లేవ‌నెత్త‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని వైఎస్‌ఆర్‌సీపీకి ఇస్తార‌న్న దానిపై సీఎం జ‌గ‌న్ కామెంట్ చేశారు. త‌మ‌కు అలాంటి ఆఫ‌ర్ ఏదీ రాలేద‌న్నారు. మేం ఎవ‌ర్నీ దాని గురించి అడ‌గ‌లేదు, ఎవ‌రి నుంచి కూడా ఆ ఆఫ‌ర్ రాలేద‌న్నారు.