Home / 18+ / పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరులో ఎటువంటి మార్పు రాలేదన్న చర్చ మరోసారి సాగుతోంది.. గత ఎన్నికల ప్రచారంలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ అధినేతనుద్దేశించి జగన్.. నువ్వెలా CM అవుతావో చూస్తా.. నీకు మగతనం ఉందా.? జగన్ నువ్వు అసలు రెడ్డి వేనా? జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు.. చిన్న కోడికత్తికే గింజుకున్నాడు.. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా.. బెజవాడ గూండాల తోలు తీస్తా.. నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు.? పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు.. థియేటర్ లో జాతీయగీతం పాడితేనే దేశభక్తి ఉన్నట్టా.? హిందువులపై ముస్లిమ్స్ దాడులు సహించను.. ముస్లిమ్స్ దేశభక్తి నిరూపించుకోవాల? ప్రత్యేకహోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. జగన్ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది MP ల మద్దతు కూడగడతా.. ఇప్పటివరకూ 2లక్షల పుస్తకాలు చదివాను. 32 మార్కులతో 10th పాసయ్యాను.. మా అన్నయ్య కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోతే సాక్షిలో నీచంగా రాశారు.. (ఆమె వెళ్ళిపోయింది 2007లో సాక్షి పేపర్ స్థాపించింది 2008లో) అని ఇష్టానుసారంగా మాట్లాడారు.. ఆయనను చూసిన ప్రతీ ఒక్కరూ.. ఈయనకంటే చిరంజివి గారు 1000 రెట్లు బెటర్.. అన్నారు.

See Also : గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.

అయితే ఒకసీటు గెలిచిన జనసేన దాదాపుగా పోటీచేసిన మిగిలిన అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయారు. దారుణంగా ఓటమిపాలైంది.. అయినా పవన్ తీరులో మార్పు రాలేదు.. ప్రచారంలో ఆయాచోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను కొడతాం.. పరుగెత్తించి కొడతాం.. ఉరికించి కొడతామంటూ వ్యాఖ్యలు చేసారు.. ఫలితాల అనంతరం మేకపోతు గాంభీర్యంతో డైలాగులతో రెచ్చిపోతూ ఉన్నవిలువలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా నన్ను కొట్టారు.. గట్టిగా కొట్టారు.. పెద్ద దెబ్బ కొట్టారు అంటూ మళ్లీ అదే మాట్లాడుతున్నారు. ఇలా కొట్టడాలు.. ఉరికించడాలు మాని మనమెందుకు ఓడిపోయాం అనేది సమీక్ష చేసుకుని ప్రజల మనసులను గెలిచే ప్రయత్రం చేయనంతవరకూ మీరు గెలవలేరు.. సీఎం సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా దాటలేరంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతగా సీఎం అవ్వాలనుకుంటే మంచి నిర్మాత, ధర్శకుల్ని పెట్టుకొని కనీసం సినిమాలోనైన సిఎం పదవి వుండేటట్టు చేయించుకొని సినిమా తీయాల్సిందేనంటున్నారు వైసీపీ అభిమానులు.