Home / 18+ / అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..

అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ సన్నబియ్యం సంగతి తేలుస్తానంటూ చెప్పగా. నువ్వు ఏమీ తేల్చలేవు, సన్న బియ్యం ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని. అవసరం అయితే నీకు కూడా ఒక బస్తా బియ్యం పంపిస్తానంటూ సమాధానం చెప్పారు.