Home / SLIDER / ‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్‌ అభినందించారు. పెయింటింగ్స్‌ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును పేదల వైద్యం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయనున్నారు.అయితే ఈ పెయింటింగ్స్‌ ప్రదర్శన రెండు రోజుల పాటు జరగనుంది.