Home / NATIONAL / ట్రైనే దారి తప్పింది

ట్రైనే దారి తప్పింది

సహాజంగా మనుషులు తప్పిపోవడం.. విమానాలు దారి తప్పడం మనకు తెల్సు.. కానీ ఏకంగా ట్రైనే దారి తప్పింది. అసలు విషయానికి వస్తే అమృత్ సర్ నుంచి కొచువేలి వెళ్లాల్సిన ASR-KCVL ఎక్స్ -ప్రెస్ దారి తప్పింది.భారీగా వర్షాలు కురుస్తుండటంతో సిగ్నల్ వ్యవస్థ దెబ్బ తింది. దీంతో దారితెలియక లోకో పైలట్ ట్రైన్ ను విజయవాడ వైపు మళ్లించాడు. అలా నడిచిన రైలు సోమవారం అర్ధరాత్రి వరంగల్ రూరల్ జిల్లా చింతపల్లి చేరుకుంది. అయితే తాము వెళ్లాల్సిన గమ్యం మార్గం మారడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు చింతపల్లి వద్ద చైన్ లాగి ట్రైన్ ను ఆపేశారు. అయితే ఇప్పటివరకు ఈ సంఘటనపై రైల్వే అధికారులు స్పందించలేదు.