Breaking News
Home / SLIDER / యువనేత కేటీఆర్ ఔదార్యం..!

యువనేత కేటీఆర్ ఔదార్యం..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుడి కూతురు ఉన్నత విద్య కోసం సహకారం అందించడానికి ముందుకొచ్చారు  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు .

తెలంగాణభవన్‌లో గురువారం జాతీయజెండా ఎగురవేసిన అనంతరం మా జీ సైనికుడు వీరభద్రాచారి కూతురు మహాలక్ష్మి ఉన్నత విద్యకు అవసరమైన చెక్కు కేటీఆర్ స్వయంగా అందించారు. తన కూతు రు తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొంది పైలట్‌గా మారాలనుకుంటున్నారని, సాయం చేయాలని ఈ నెల 10న కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా వీరభద్రాచారి కోరారు.

ఒక సైనికుడిగా మీ ధైర్యసాహసాలు అమూల్యమైనవి. ఉన్నత విద్యకు సహకరిస్తా అని కేటీఆర్ ట్విట్టర్‌లో భరోసాఇచ్చారు. గురువారం వీరభద్రాచారిని తెలంగాణభవన్‌కు పిలిపించారు. అవసరమైన ఆర్థికసహాయాన్ని కేటీఆర్ మిత్రుడి ద్వారా అందించారు. స్వాతంత్య్ర దినోత్సవాన మాజీ సైనికునికి సాయం అందించం కన్నా గొప్పగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఏముంటుందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.