Breaking News
Home / MOVIES / రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ …అభిమానుల‌కు ఇక పండగే

రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ …అభిమానుల‌కు ఇక పండగే

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్నRRR సినిమా గురించి ఓ వార్త సంచలనం రేపుతుంది. టాలీవుడ్ ఈ మద్య హీరోలు రియల్‌ఫైట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాహోలో కూడా కొన్ని చోట్ల డూప్‌లు, జాగ్రత్తలు తీసుకున్నా అనుకూలంగా వున్న చోట్ల రియల్‌ ఫైట్లను చేశానని ప్రభాస్‌ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ‘RRR’లోనూ డూప్‌ లేకుండా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ నటిస్తున్నాడంట. బల్గేరియాలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం రాజమౌళి కొంతమంది టీమ్‌ను అక్కడికి తీసుకువెళ్ళినట్లు సమచారం. ఆ యాక్షన్ ఏంటో తెలుసా ..పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసేలా సినిమాను తెరకెక్కిస్తున్నార‌ని టాక్. మన్యం వీరుడు నేపథ్యంలో కథ కాబట్టి ఒరిజినల్‌ పులి అయితే బాగుంటుందని రాజమౌళి అనడంతో అక్కడ తర్ఫీదు చెందిన పులితో ఎన్‌టిఆర్‌ ఫైట్‌ చేయనున్నాడని చిత్రయూనిట్‌ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజం ఏంతో తెలియ‌దు కానీ నిజంగానే పులితో ఫైట్ ఉంటే మాత్రం అభిమానుల‌కు ఇక పండగే.