Breaking News
Home / ANDHRAPRADESH / ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టురట్టు చేసిన విజయసాయి రెడ్డి..!

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టురట్టు చేసిన విజయసాయి రెడ్డి..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టు మొత్తం బయటకు లాగేసాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు ఇంకోలా మాట్లాడడం అంటే అది మీ తరువాతే అని అన్నారు.దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు అని చెప్పారు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నోడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూర్ అంటే నమ్మే అమాయకులుంటారా? ప్రశ్నించారు. వీలైతే సహాయం చెయ్యాలి తప్పా ఇలా ప్రజలకు మంచి చూస్తుంటే చూసి ఓర్వలేక ప్రశాంతంగా ఉన్న ప్రజలను మీ నీచపు రాజకీయాలతో ఇబ్బంది పెట్టకండి అని అన్నారు.