Home / SLIDER / వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు

వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు

మెగా కాపౌండ్ హీరో,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరో వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. హీరో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సరికొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

అందులో భాగంగా బోయ కులస్తులు ఈ చిత్రం తమను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సెన్సార్ బోర్డు,ఫిలిం ఛాంబర్ తో పాటుగా హీరో వరుణ్ తేజ్,చిత్రం యూనిట్ కు నోటీసులు జారీచేసి నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది.