Breaking News
Home / MOVIES / రాహుల్‌ పునర్నవిలకు బిగ్‌బాస్‌ షాకింగ్ ట్విస్ట్‌..సీజన్‌ మొత్తం నామినేట్‌

రాహుల్‌ పునర్నవిలకు బిగ్‌బాస్‌ షాకింగ్ ట్విస్ట్‌..సీజన్‌ మొత్తం నామినేట్‌

తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్‌ పై రోజురోజుకి కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. హౌస్ లో రొమాన్స్ ఎక్కవైపోతున్నాయి అని కామెంట్స్ పేలిపోతున్నాయి. ఇకపోతే ఏ టాస్క్‌ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్‌ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని తాగేశాడు. అనంతరం నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యావని చెప్పగానే పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని ముద్దుపెట్టింది. ఇక రాహుల్‌ పునర్నవిల స్నేహం మరింత గట్టిపడిందని సంతోషించేలోపే బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇవ్వనున్నాడు. రాహుల్‌ను సేవ్‌ చేయడానికి పునర్నవి సీజన్‌ మొత్తం నామినేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించాడు. దీనికి మొదట పున్ను నిరాకరించినట్టు కనిపించినా చివరికి ఏదో జరిగినట్టు తెలుస్తోంది. రాహుల్‌ కోసం పునర్నవి అంతటి త్యాగానికి సిద్ధపడుతుందా, లేదా అన్నది ఈరోజు జరిగే ఏపిసోడ్ లో చూడాలి.