Home / SLIDER / రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతన్నలకు ఆర్థిక సాయమందించడానికి తీసుకొచ్చిన అద్భుత పథకం రైతుబంధు.

ఈ పథకం కింద ప్రతి రైతన్నకు ఎకరాకు రెండు పంటలకు కల్పి మొత్తం పదివేల రూపాయలను ఆర్థికసాయంగా పెట్టుబడికి అందిస్తుంది. ఈ క్రమంలో రైతుబంధు పథకానికి పరిమితులున్నాయి.

కేవలం ఐదెకరాల భూములున్న రైతన్నలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరిగింది. రైతుబంధుపై వస్తోన్న ఈ ప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకానికి ఐదెకరాలు,పదెకరాలంటూ ఎలాంటి పరిమితి లేదని .. అలా విధించబోమని “స్పష్టం చేశారు.